కాళేశ్వరం ఎంక్వైరీ.. నేడు విచారణకు హాజరు కానున్న స్మితా సబర్వాల్, వికాస్ రాజ్

కాళేశ్వరంపై విచారణకు హాజరుకావాలని పలువురు ఐఏఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-07-15 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరంపై విచారణకు హాజరుకావాలని పలువురు ఐఏఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఐఏఎస్‌లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితాసబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసి ఇటీవల రిలీవ్ అయిన వికాస్ రాజ్ హాజరుకానున్నారు.

ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అలాగే రిటైర్ అయిన ఐఏఎస్‌లలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్, ఎస్కేజోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించిన నాగిరెడ్డిలను సైతం విచారణకు హాజరు కావాలని పిలిచారు. అయితే గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ ఇన్ ఛార్జి కార్యదర్శిగా స్మితా సబర్వాల్ పనిచేశారు. ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్ రాజ్ గతంలో కొంత కాలం నీటి పారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.

నేడు విచారణకు స్మితాసబర్వాల్, వికాస్ రాజ్ హాజరు కానుండటంతో వారు కమిషన్ ఎదుట వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టగా.. నేడు కమిషన్ ఎదుట విచారణకు విద్యుత్ శాఖ ఇంజినీర్ రఘు హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇంజినీర్ రఘు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 


Similar News