ఇన్ ఫ్లుయెంజా కేసులు : రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్
వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్3 ఎన్2 వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇన్ ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యశాఖ కార్యదర్శి రిజ్వితో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇన్ ఫ్లుయెంజా కేసులు రాష్ట్రంలో విస్తరిస్తే అనుచరించాల్సిన వ్యుహాం, ఆరోగ్య శాఖ సన్నద్ధతపై మంత్రి అధికారులతో చర్చించారు. కాగా ఈ కేసులు కరోనా మాదిరిగానే విస్తరిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవలే చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, కోమర్బిడ్ పరిస్థితులు కలిగిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.