రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా అలర్ట్!

దేశ వ్యాప్తంగా ఇన్​ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది.

Update: 2023-03-09 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా ఇన్​ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. మన రాష్ట్రంలోనూ కేసులు పెరిగితే ఎలా? ఎదుర్కోవాలనే దానిపై వైద్యారోగ్యశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు హెల్త్​హెచ్‌వోడీలు, డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఏ వయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందనే విషయాన్ని అధికారుల నుంచి మంత్రి అడిగి తెలుసుకున్నారు. కరోనా తరహాలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదా? ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితులు ఏలా ఉన్నాయి? వ్యాధి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేమిటీ? అనే అంశాలపై మంత్రి రివ్యూ చేశారు. ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

అడ్మిషన్లలో పిల్లలే...

ఇన్‌ఫ్లుయెంజాతో పిల్లలే ఎక్కువగా హాస్పిటళ్లలో చేరాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్​కొనసాగుతున్నదని పబ్లిక్​హెల్త్ డైరెక్టర్ డాక్టర్​గడల శ్రీనివాసరావు మంత్రికి వివరించారు. దీంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో వచ్చే కేసులపై రీసెర్చ్​చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సపరేట్‌గా చికిత్సను అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. నిలోఫర్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్వాస సమస్యలు వచ్చినోళ్లకు సమస్యలు లేకుండా ఆక్సిజన్​బెడ్లను కూడా రెడీగా ఉంచాలని మంత్రి అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు సూచించారు.

క్రమంగా పెరుగుతుంది...

రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం, జలుబు, ఇతర ఫ్లూ సింప్టమ్స్‌తో ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీకి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇందులో అత్యధికంగా పిల్లలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అడ్మిషన్లు కూడా పిల్లలకే అవసరం అవుతుంది. పెద్ద వాళ్లు కేవలం ఓపీ ట్రీట్‌మెంట్‌తోనే కోలుకుంటున్నారు. లక్షణాలను కంట్రోల్ చేసే మెడిసిన్స్​ తో రికవరీ అవుతున్నారు. ఈ ఏడాది జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 205 కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్​ మాట్లాడుతూ.. ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం పొందాలన్నారు. డాక్టర్ల సూచన లేకుండా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్‌, పెయిన్ కిల్లర్స్ వంటి మెడిసిన్ అసలు వినియోగించొద్దని కోరారు.


ఇవి కూడా చదవండి :

కవిత జంతర్‌మంతర్ దీక్షకు హాజరయ్యేదెవరు?  

కవితకు ఈడీ నోటీసులు: రేవంత్ రెడ్డి మౌనమెందుకు?  

Tags:    

Similar News