‘ప్రీతి కుటుంబాన్ని కలిసి ఓదార్చే టైం లేదా కవితక్క’
వరంగల్ మెడికో ప్రీతి మృతిపై ఆమె తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఇందిరాశోభన్ స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ మెడికో ప్రీతి మృతిపై ఆమె తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఇందిరాశోభన్ స్పందించారు. వారిని కలిసి ఓదార్చే సమయం లేదా కవిత అక్క? అని ప్రశ్నించారు. మీరు రాసే లేఖలు కేవలం పత్రిక ప్రకటనకు, పబ్లిసిటీకి మాత్రమే పనికి వస్తాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరికి కష్టం వచ్చినా మేం ఉన్నాం అని భరోసా ఇచ్చిన జాగృతి ఎక్కడ? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన మీరు.. స్వరాష్ట్రం వచ్చాక ఉద్యమకారులే పాలకులైనప్పుడు మహిళా సమస్యలకు రక్షణ, విద్య, వైద్యం, ఉపాధి, బెల్ట్ షాపుల రద్దు, మద్యం నియంత్రణ, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలకు పరిష్కారం కల్పించే దిశలో ఎందుకు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఎమ్మెల్సీ కవితపై ఇందిరాశోభన్ మండిపడ్డారు. ఇదేనా తెలంగాణ ఉద్యమంలో మనం నేర్చుకున్నది అని కవిత ట్వీట్‌కు ఇందిరా కామెంట్స్ చేశారు. జాగృతి ద్వారా మహిళలను జాగృతం చేసింది ఆలోచించండి...పరిష్కార దిశగా అడుగులు వేయండని అన్నారు. సంపాదనపైన ఉన్న మక్కువ తెలంగాణ ఆశయం కోసం చెప్పిన మాటలు నెరవేర్చే దిశగా ఎందుకు లేవని ధ్వజమెత్తారు.
ఇక మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం నాడు మహిళలందరినీ ప్రగతిభవన్లో ఒక్కటి చేస్తారు గంతే అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళల సాధికారత కోసం వినూత్నంగా ఏం చేశారు? అని ఇందిరాశోభన్ ఫైర్ అయ్యారు. ఏ ఒక్కనాడైనా శిశు మహిళా శాఖతో కానీ, ఉమెన్ కమిషన్‌తో కానీ చర్చించారా? అని ప్రశ్నించారు. ఇవాళ మీ చేతిలో పవర్ ఉంది. మీరు అనుకుంటే చట్టాలు అమలవుతాయి. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు.
వెళ్లి కలిసి ఓదార్చే సమయము లేదా @RaoKavithaఅక్క.ఈ లేఖలు కేవలం పత్రిక ప్రకటనకు, పబ్లిసిటీకి మాత్రమే పనికి వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామని భరోసా ఇచ్చిన జాగృతి ఎక్కడ? ఇవాళ మీ చేతిలో పవర్ ఉంది.అనుకుంటే చట్టాలు అమలవుతాయి. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. https://t.co/OgrZCiyqOy
— Indira Shoban (@IndiraShoban) February 28, 2023