CM కేసీఆరే టార్గెట్‌గా తెలంగాణలో మరో పాదయాత్ర..!

తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ పాదయాత్రల ట్రెండ్ కొనసాగుతోంది.

Update: 2023-02-18 13:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ పాదయాత్రల ట్రెండ్ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఇప్పటికే పలు దఫాలుగా ప్రజల్లోకి వెళ్లగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. వీరితో పాటు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ సైతం పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. మార్చి మొదటి వారంలో ఆత్మగౌరవ యాత్ర చేపట్టబోతున్నట్లు శనివారం ఆమె ప్రకటించారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ బారి నుంచి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఆత్మగౌరవ యాత్రకు మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, యువత, కార్మికులు, కర్షకులు, మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడని.. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరుల కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాళ్లకు గజ్జ కట్టిన కళాకారులు, కలం పట్టిన రాసిన కవులు, జర్నలిస్టుల పాత్ర ఎంత ఉన్నదో ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర విషయంలో మీ బాధ్యత అంతే ఉందన్నారు. 

Also Read...

పొంగులేటి పార్టీ మార్పుపై YS విజయమ్మ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News