Independence Day: అంబురాన్నంటిన స్వాతంత్య్ర సంబురాలు.. జెండా ఎగురవేసిన ప్రముఖులు

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా జెండా పండుగను అట్టహాసంగా జరుపుకుంటున్నారు.

Update: 2024-08-15 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా జెండా పండుగను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరారు. అక్కడ అమరవీరులకు స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అదేవిధంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ అవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, దయనంద్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా‌చార్యులు, తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..