భగవద్గీత పై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి
తెలంగాణ యాసతో బిత్తిరి సత్తి వార్తలతో తెలంగాణ రాష్ట్రంలో బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి) ఎంతో ఫేమస్ అయ్యాడు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ యాసతో బిత్తిరి సత్తి వార్తలతో తెలంగాణ రాష్ట్రంలో బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి) ఎంతో ఫేమస్ అయ్యాడు. అనంతరం పలు సినిమాల్లో కూడా నటించారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ వేదికగా కామెడీ వీడియోలు చేస్తూ ఉండే బిత్తిరి సత్తి.. ఓ వివాదంలో ఇరుకున్నారు. భగవద్గీత ను అవమానించేలా.. బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హీందు సంఘాలు అతనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. భగవద్గీతను కించపరచేలా వీడియో చేశాడని బిత్తిరి సత్తిపై రాష్ట్రీయ వానరసేన తాజాగా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పోలీస్ కేసు విషయం తెలుసుకున్న బిత్తిరి సత్తి తాజా వివాదంపై స్పందించారు. తాను కావాలని భగవద్గీతపై తప్పుడు వ్యాఖ్యలు కావాలని చేయలేదని, స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా ఇలా జరిగిందని.. తన వ్యాఖ్యల వల్ల తన మిత్రులు శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగి ఉంటే తనను క్షమించాలని కోరాడు. అలాగే కొంతమంది కావాలనే తన వీడియో క్లిప్పులను కట్ చేసి ట్రోల్ చేస్తున్నారని అలాంటి వారిపై తాను చట్ట పరంగా ఎదుర్కొంటానని గురువారం విడుదల చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు.