కులం పేరుతో మహిళా ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆగ్రహం (వీడియో)

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) అత్యుత్సాహం ప్రదర్శించారు. దళితులను కులం పేరుతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-09-13 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) అత్యుత్సాహం ప్రదర్శించారు. దళితులను కులం పేరుతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో గణేష్ విగ్రహ శోభాయాత్రను ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ గలాటా జరిగినట్లు సమాచారం రావడంతో ఎస్ఐ స్రవంతి, వారి సిబ్బందితో అక్కడకు చేరుకొని, డ్యాన్స్ చేస్తోన్న యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువకులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ఎస్ఐ కులం పేరుతో దూషించింది. ఈ ఘటనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి తీవ్ర స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ''కులం పేరుతో దూషించిన ఈ సబ్ ఇన్‌స్పెక్టర్ మీద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా పట్టుతప్పింది. ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. అది బొత్తిగా కనపడడం లేదు. ఒక పౌరుడు దైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒక ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయగలడా? డబ్బు లేక అధికారం ఏలుతుంది రాజ్యం.'' అని రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News