గురుకుల పాఠశాలలో దారుణం.. 120 మంది పిల్లలకు అస్వస్థత

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో కలుషిత నీరు కారణంగా 600 మంది విద్యార్థుల్లో 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2022-08-31 05:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో కలుషిత నీరు కారణంగా 600 మంది విద్యార్థుల్లో 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా గురుకులంలో మెడికల్ క్యాంపు నడుస్తుండడంతో విద్యార్థులు హెల్త్‌చెకప్స్ చేయించుకున్నారు. దీంతో, టైఫాయిడ్, జ్వరం, దగ్గు, జలుబు, చర్మ సంబంధిత వ్యాధులతో 120 మంది విద్యార్థులు బాధపడుతున్నట్లు తెలిసింది. మరికొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గురుకులంలో విద్యార్థుల అవసరాలకు వాడే నీరు దగ్గరలో ఉన్న చెరువు మధ్యలో ఉండే బోరు బావి నుండి వస్తుంటాయి. అయితే, ఆ బావి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీటమునిగిపోయిందని, ఈ నీటినే యాజమార్యం ఓ సంపులో స్టోరేజ్ చేసి విద్యార్థుల అవసరాలకు (స్నానం చేయడం, వంటల కోసం) ఉపయోగిస్తారని తేలింది. ఈ విధమైన కలుషిత నీటిని ఉపయోగించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

Tags:    

Similar News