IIM: తెలంగాణ నుంచి కొత్త ఐఐఎమ్ ప్రతిపాదన లేదు!.. కేంద్ర మంత్రి లేఖ

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఎటువంటి ప్రతిపాధన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ అన్నారు.

Update: 2024-07-23 14:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఎటువంటి ప్రతిపాధన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ అన్నారు.ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రతి రాష్ట్రంలో ఒక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ఒక ఐఐఎం ను నెలకొల్పాలని, దానికి కావల్సిన స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

ఇందులో తెలంగాణలో కొత్త ఐఐఎం ఏర్పాటుకు సంబందించి డిసెంబర్ 26, 2023 లో ఒక సారి, మార్చి 2,2024 తేదీన రెండవ సారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని కానీ, ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుకు ప్రతిపాదన లేదని పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా 21 ఐఐఎం లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని, 2015 నుంచి ఇప్పటివరకు 7 చోట్ల ఏర్పాటు కూడా చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పలు మార్లు ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర అభివృద్దిపై పలు ప్రతిపాధనలు చేస్తూనే.. హైదరాబాద్ లో కొత్త ఐఐఎం ను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వినతి పత్రాలు అందజేశారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ విధంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. 



 


Tags:    

Similar News