IG Satyanarayana: కలెక్టర్‌పై దాడి కేసు.. ఐజీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

కలెక్టర్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కొడంగల్ కోర్టు (Kodangal Court)లో హాజరుపరిచారు.

Update: 2024-11-13 13:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలెక్టర్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కొడంగల్ కోర్టు (Kodangal Court)లో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు నరేందర్ రెడ్డి (Narender Reddy)కి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అక్కడి నుంచి పోలీసులు ఆయనను నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ క్రమంలోనే దాడికి సంబంధించి ఐజీ సత్యనారాయణ సంచలన విషయాలు వెల్లడించారు. కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో నరేందర్ రెడ్డి పాత్రే కీలకం అని అన్నారు. నరేందర్ రెడ్డిని జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)కి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. రేపు కస్టడీపై కోర్టులో వాదనలు కొనసాగుతాయని తెలిపారు. దాడి చేసిన 42 మందిలో 19 మందికి అసలు భూమి లేదని గుర్తించామని అన్నారు. కలెక్టర్‌పై దాడి చేసిన వారిలో లగచర్ల గ్రామస్తులు లేరని.. బయట వారే పక్కా ప్లాన్ ప్రకారం కలెక్టర్‌పై దాడి చేశారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.

Tags:    

Similar News