బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆరే ముఖ్యమంత్రి: బండి సంజయ్
ఈ ఎన్నికల్లో ఒక వేళ బీఆర్ఎస్ లేదా? కాంగ్రెస్ గెలిచిన తెలంగాణలో ఉప ఎన్నికలు గ్యారెంటీ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఎన్నికల్లో ఒక వేళ బీఆర్ఎస్ లేదా? కాంగ్రెస్ గెలిచిన తెలంగాణలో ఉప ఎన్నికలు గ్యారెంటీ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన కరీంనగర్‌లో మాట్లాడారు. ఒక వేలా బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతారని, కానీ కేసీఆర్‌కు సీఎం పదవికి పేరు సూచించే దమ్ము లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్‌కు సీఎం పదవి ఇస్తే.. ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు, హ్యాపీ రావు పార్టీ నుంచి వారి అనుచురలను తీసుకోని వెళ్లిపోతారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు.
ఒక సెక్షన్ మీడియా వాళ్లు గెలుస్తరు.. వీళ్లు గెలుస్తరు అని ప్రచారం చేస్తున్నదని, గతంలో దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా దుబ్బాకలో బీజేపీ గెలవదు.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉన్నట్లు ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. కానీ అక్కడ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదని, బీజేపీ గెలిచిందని చెప్పారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయని, అప్పుడు కూడా ఇలా బీజేపీ గెలవదనే ప్రచారం జరిగిందని, కానీ 4 సీట్లున్న బీజేపీ 40 స్థానాలు గెలిచిందని గుర్తుచేశారు. ఇది వరకు సర్వేలు అన్ని బీజేపీ గెలవదని చెప్పాయని, కానీ వాటిని తిప్పికొడుతూ ఇదివరకు జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీటైన జవాబు ఇచ్చామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారని అందుకే బీజేపీ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిందని గుర్తుచేశారు.
Read More..
ముఖ్యమంత్రి అవుతానని ఏనాడూ నేను చెప్పలేదు : Bandi Sanjay Kumar