నరేంద్ర మోడీపై కేసు వేస్తా : రేణుకా చౌదరీ

ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేస్తానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరీ మీడియాకు తెలిపారు. 2018 లో రాజ్యసభలో చర్చల సందర్బంగా

Update: 2023-03-24 06:53 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేస్తానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరీ మీడియాకు తెలిపారు. 2018 లో రాజ్యసభలో చర్చల సందర్బంగా మోడీ తనను ఉద్దేశిస్తూ శూర్పనకలా నవ్వుతోంది.రామాయణం తరువాత ఇలాంటి నవ్వు వినే అవకాశం కలిగింది అంటూ పరోక్షంగా తనను శూర్పనక తో పోలుస్తూ వ్యాఖ్యనించారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిపైనే ఫిర్యాదు చెయ్యనున్నట్టు చెప్పిన ఆమె కోర్టు ఎంత వేగంగా స్పందిస్తుందో చూడాలన్నారు.

Tags:    

Similar News