ఐసెట్ గడువు పొడిగింపు.. దరఖాస్తులకు చివరి తేదీ అదే
ఐ సెట్ దరఖాస్తు గడువును ఈనెల 12వ తేదీ వరకు అధికారులు పొడిగించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఐ సెట్ దరఖాస్తు గడువును ఈనెల 12వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. తొలుత ఈనెల 6వ తేదీ వరకు గడువుకు చివరి తేదీ ఉంది. కాగా ఉన్నత విద్యామండలి అధికారులు ఆదేశాల మేరకు ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టంచేశారు. రూ.250 ఆలస్య రుసుముతో ఈనెల 15వ తేదీ వరకు, రూ.500 లేట్ ఫీజుతో ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా ఈ నెల 26, 27 తేదీల్లో ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఐ సెట్ కన్వీనర్ వరలక్ష్మి తెలిపారు. ఈ పరీక్షను 20 ఆన్ లైన్ ప్రాంతీయ కేంద్రాల్లో 75 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని 16, ఆంధ్రప్రదేశ్ లో 4 కేంద్రాలున్నాయి. నాలుగు సెషన్లలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ స్పష్టంచేశారు.