AP వెళ్లేందుకు నో ఇంట్రెస్ట్.. VRS యోచనలో సోమేష్ కుమార్..?
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కి వెళ్లాలని ఇవాళ ( మంగళవారం) తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కి వెళ్లాలని ఇవాళ ( మంగళవారం) తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కేడర్ కేటాయింపు వివాదానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ రాగానే సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించిన గంటల వ్యవధిలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ కుమార్‌ను తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ అయ్యి.. 12వ తేదీలోపు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఏపీకి వెళ్లేందుకు సోమేష్ కుమార్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌లో రిటైర్ కానున్న సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. తక్షణమే తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ కావాలన్న కేంద్రం ఆదేశాల నేపథ్యంలో సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రం రిలీవ్ ఆర్డర్ జారీ చేసిన నేపథ్యంలో సోమేష్ కుమార్ నెక్ట్స్ స్టె్ప్ ఏంటనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం సోమేష్ కుమార్‌ను ఇంకా రిలీవ్ చేయలేదు.