మీ అమ్మమ్మ ఒక్కరే సంతోషపడాలా?: మంత్రి కేటీఆర్ కు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సూటి ప్రశ్న

మంత్రి కేటీఆర్ పై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు.

Update: 2023-07-09 05:21 GMT

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ పై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. కామారెడ్డిలోని కోనాపూర్ లో అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించామని, ఈ విషయం తెలిస్తే తన అమ్మమ్మ వెంకటమ్మ చాలా సంతోషపడుతుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆకునూరి మురళి మీ అమ్మమ్మ ఒక్కరే సంతోషపడితే సరిపోతుందా.. రాష్ట్రంలోని 26,000 అమ్మమ్మలు సంతోషపడొద్దా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఏర్పడిన 8 సంవత్సరాల తర్వాత మనఊరు మనబడి అంటివి. రూ.7268 కోట్లు అంటివి. ఇప్పటి వరకు రూ.430 కోట్లు (6%) మాత్రమే ఖర్చు పెడితివి. 26,000 ప్రభుత్వ బడులల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News