IAS Amoy Kumar: భూదాన్ భూముల వ్యవహారం.. మూడో రోజు అమోయ్ కుమార్‌పై ముగిసిన ఈడీ విచారణ

ప్రభుత్వ (Government), భూదాన్ (Bhoodhan) భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ (IAS Amoy Kumar)పై ఈడీ విచారణ వేగవంతం చేసింది.

Update: 2024-10-25 13:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ (Government), భూదాన్ (Bhoodhan) భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ (IAS Amoy Kumar)పై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ మేరకు వరుసగా మూడో రోజు అధికారులు ఆయనను సుధీర్ఘంగా విచారించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ సాయత్రం 5.30 వరకు కొనసాగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం (Meheshwaram) మండల పరిధిలోని నాగారం (Nagaram) భూదాన్ భూముల వ్యవహారంపైనే అయోయ్ కుమార్‌ (Amoy Kumar)ను ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రూ.కోట్లు విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే చవకగా ఇతరులకు కేటాయించడంపై వచ్చిన ఆరోపణల మీదే ఈడీ (ED) ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అమోయ్ కుమార్ (Amoy Kumar) ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు పూర్తిగా రికార్ట్ చేశారు. అయితే, రేపు కూడా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

కాగా, గతంలో అమోయ్ కుమార్ రంగారెడ్డి (Ranga Reddy), మేడ్చల్ జిల్లా (Medchal District)ల కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)లోని రైతులను బెదిరించి అక్రమంగా తమ భూములను లాక్కున్నారని ఆ ప్రాంత రైతులు రెవెన్యూ అధికారులు (Revenue Offcials), పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును ఈడీ అధికారులు (ED Officials) టేకప్ చేయగా.. అమోయ్ కుమార్‌ (Amoy Kumar)ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, గత రెండు రోజలుగా ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్ట్ చేస్తున్నారు. 


Similar News