ఆ నిర్మాణాలు కూల్చబోం.. హైడ్రా సంచలన నిర్ణయం

అక్రమార్కుల గుండెంల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు.

Update: 2024-09-08 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్రమార్కుల గుండెంల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. నివాసం ఉంటోన్న గృహాలను కూల్చబోమని.. ఎఫ్‌టీఎల్, బఫర్‌‌జోన్‌లో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని అన్నారు. కాగా, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది. తాజాగా ఆదివారం ఒకేసారి నగర నలు మూలల మూడు చోట్ల కూల్చివేతలు చేపట్టారు.

Read More : జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల స్థలాలు కొనే వారికి హైడ్రా కీలక సూచన


Similar News