కాంగ్రెస్ MLA సంచలన ఆరోపణలు.. హైడ్రా చీఫ్ రంగనాథ్ రియాక్షన్ ఇదే

కాంగ్రెస్ నేత(Telangana Congress), జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) ఆరోపణలకు హైడ్రా(Hydraa) చీఫ్ ఏవీ రంగనాథ్(AV Ranganath) వివరణ ఇచ్చారు.

Update: 2025-03-18 15:28 GMT
కాంగ్రెస్ MLA సంచలన ఆరోపణలు.. హైడ్రా చీఫ్ రంగనాథ్ రియాక్షన్ ఇదే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత(Telangana Congress), జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) ఆరోపణలకు హైడ్రా(Hydraa) చీఫ్ ఏవీ రంగనాథ్(AV Ranganath) వివరణ ఇచ్చారు. హైడ్రా లావాదేవీలు జరిపినట్లు ఫిర్యాదులు ఉంటే.. తమకు, ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వంశీరాం బిల్డర్లపై ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.. కానీ ఇంకా ఆ ఫిర్యాదు తమకు అందలేదని రంగనాథ్(AV Ranganath) చెప్పారు. తమ వరకూ వచ్చి ఫిర్యాదు చేసేంత టైమ్ లేకపోయినా.. వాట్సాప్‌ ఫిర్యాదు చేసినా పరిశీలిస్తామని అన్నారు. హైడ్రా ఏర్పాటు అయ్యాక.. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపించామని తెలిపారు.

కాస్త ఆలస్యమైనా.. తప్పకుండా తమ వద్దకు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపిస్తాం అని రంగనాథ్ అన్నారు. ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. హైడ్రా(Hydraa) ఏర్పాటయ్యాక.. ఇప్పటివరకు 9800 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. హైడ్రా పేరుతో ఎవరైనా అవకతవలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలా ప్రయత్నాలు చేసిన కొందరిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

కాగా, ఇటీవల హైడ్రాపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి అన్సర్ ఉండదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో కంప్లైంట్ చేసినా స్పందన లేదని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News