HYDRA: మా 20 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కబోతోంది : అమీన్‌పూర్ వాసుల సంచలన ప్రకటన

చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zone)లోని ఆక్రమణలు నేలమట్టం చేస్తోంది.

Update: 2024-10-24 06:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zone)లోని ఆక్రమణలు నేలమట్టం చేస్తోంది. పార్టీలకు అతీతంగా.. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) ఆధ్వర్యంలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది.

ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా (Sangareddy Distrcit) అమీన్‌పూర్ (Ameenpur) పరిధిలోని పద్మావతి నగర్ (Padmavathi Nagar) లేఅవుట్ బాధితులు ‘హైడ్రా’ (HYDRA)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మావతి నగర్ లేఅవుట్ పరిధిలో 20 ఏళ్ల కిందట 24 ఎకరాలను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అయితే, అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (MLA Katasani Rambupal Reddy) తమ ప్లాట్లను పూర్తిగా కబ్జా చేసి.. భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి బెదరింపులకు గురి చేశారని వారు ఆరోపించారు.

ఇదే విషయమై తాము ఇటీవలే ‘హైడ్రా’కు ఫిర్యాదు చేయగా హుటాహుటిన రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్ పద్మావతి నగర్ లేఔట్‌ను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. తాజాగా, ఆయన ఆదేశాల మేరకు లేఅవుట్‌లో అక్రమంగా నిర్మించిన ప్రహరీలను రెవెన్యూ అధికారులు (Revenue Officials) కూల్చివేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లోనే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని హైడ్రా (HYDRA)కు, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి పద్మావతి నగర్ లేఅవుట్ బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Similar News