HYDRA: ‘హైడ్రా’ కమిషనర్‌తో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ భేటీ.. సంస్థ అభివృద్ధికి రూ.25 లక్షలు విరాళం

HYDRA ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.

Update: 2024-08-29 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: HYDRA ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆ పదం వింటేనే కబ్జాదారులు, ఆక్రమార్కుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎవరికి ఎప్పుడు నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళనకు గురవుతున్నారు. మరికొందరు తమ నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా నేలమట్టం చేస్తారేమోనని హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా హైడ్రాతో చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, బఫర్‌ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు నిద్రపట్టడం లేదు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్‌ను ఏవీ రంగానాథ్‌ను రాజ్యసభ ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయన హైడ్రా సంస్థ అభివృద్ధి కొరకు తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు యుద్ధ ప్రాతికన స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టాలని పోలీసు శాఖను కోరినట్లుగా ఆయన తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హైదరాబాద్‌ను అమెరికా చేసి చూపిస్తామంటూ గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. నగరంలో ఉన్న మెజారిటీ చెరువులు, కుంటలను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని మండిపడ్డారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు వచ్చినా.. తాను భయపడే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 


Similar News