HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన.. ఇక మీదట అలా చేస్తామని కామెంట్

చెరువులు, కుంటలు, బఫర్‌ జోన్లు, ప్రభుత్వం భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) రాష్ట్రంలోనే కాదు పక్కా రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2024-08-28 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెరువులు, కుంటలు, బఫర్‌ జోన్లు, ప్రభుత్వం భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) రాష్ట్రంలోనే కాదు పక్కా రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా ‘హైడ్రా’ బలంగా పని చేస్తోంది. ఆకాశన్నంటిన భవనాలను సైతం ఒక్క పెట్టున బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘హైడ్రా’ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే హైడ్రా పేరిట ప్రతేక చట్టాన్ని రూపొందించబోతున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు, నిబంధనలపై సర్కార్ వర్కవుట్ కొనసాగుతోందని అన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరుతో కబ్జాదారులకు స్వయంగా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇక హైడ్రా కార్యకలాపాలకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ చేపట్టి వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని అన్నారు.


Similar News