మీ సమస్యలు పరిష్కరిస్తా : MLC kavitha
మైనార్టీ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చూస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మైనార్టీ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చూస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శుక్రవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వారి చదువు కోసం లోన్స్ ఇప్పించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆమె వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖాజా మొయినుద్ధీన్ , రియాజ్ ఖాన్ , డాక్టర్ అబ్దుల్ నయీం , మహ్మద్ తాఫీక్ ఉర్ రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.