సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Update: 2024-07-03 13:28 GMT

దిశ,బేగంపేట : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ చుట్టాలబస్తీ గ్రౌండ్ లోని కమ్యూనిటీ హాల్ లో 9.50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు. స్థానిక యువత ఈ జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పక్కనే ఉన్న వ్యాయామశాల ( దంగల్) ను సందర్శించి పరిశీలించారు. వ్యాయామశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని ఈ సందర్భంగా నిర్వహకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ వ్యాయామశాల

    మరింత అభివృద్ధి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. అదేవిధంగా గ్రౌండ్ లో మొక్కలు నాటడం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. సీవరేజ్ సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, శానిటేషన్ డీఈ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, విజయ్, మహేష్, బస్తీవాసులు సతీష్, కిరణ్, వెంకట్, రాకేష్ తదితరులు ఉన్నారు.


Similar News