నిండుకుండల్లా జంట జలాశయాలు

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు.

Update: 2024-09-25 16:14 GMT

దిశ, గండిపేట్ : ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ రిజర్వాయర్లు పూర్తిగా నిండి నిండు కుండలను తలపిస్తున్నాయి. వీటి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 242 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటును ఒక అడుగు ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఏదైనా సాయం కావాలంటే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించాలని పేర్కొన్నారు. 

Tags:    

Similar News