ఫ్యాట్ పిజియన్ పబ్‌పై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు..

జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ లో భాగంగా యధావిధిగా ట్రాఫిక్‌ని తనిఖీ చేస్తూ తమ విధులు నిర్వర్తిస్తుండగా రోడ్ నెంబర్ 45 లో ఉన్న ఫ్యాట్ పిజియన్ పబ్‌ వద్ద మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Update: 2023-02-15 16:32 GMT

దిశ, జూబ్లిహిల్స్: జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ లో భాగంగా యధావిధిగా ట్రాఫిక్‌ని తనిఖీ చేస్తూ తమ విధులు నిర్వర్తిస్తుండగా రోడ్ నెంబర్ 45 లో ఉన్న ఫ్యాట్ పిజియన్ పబ్‌ వద్ద మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా సమాచారం తెలుసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు వెంటనే స్పందించి భగవంతు అనే హోంగార్డ్ ట్రాఫిక్‌ని తనిఖీ చేస్తుండగా, రోడ్డు నెంబర్ 45 మెయిన్‌రోడ్డు వద్ద ఫ్యాట్ పిజియన్ పబ్‌ వద్దకు చేరుకొని చూడగా పబ్ వినియోగదారులకు సరైన పార్కింగ్‌ లేకపోవటంతో వాహనాలను రోడ్ నెంబర్ 45 పైనే పార్కింగ్ చేశారని గుర్తించాడు.

హోంగార్డ్ వెంటనే తన మొబైల్‌తో వీడియో తీసి ట్రాఫిక్ సీఐ వినోద్ కుమార్ సహాయంతో ఫ్యాట్ పిజియన్ పబ్‌ పై ట్రాఫిక్ ఉల్లంఘించిన నేపథ్యంలో జూబ్లిహిల్స్ లాండ్ ఆర్డర్ పోలీస్ వారికి పిర్యాదు చేయగా, జూబ్లిహిల్స్ పోలీసులు ఫ్యాట్ పిజియన్ పబ్‌ పై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే పబ్‌పై పీఎస్‌ లో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని జూబ్లిహిల్స్ లాండ్ ఆర్డర్ పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News