Traffic : పార్కింగ్‌కు నిలయంగా ప్రధాన రహదారి..

పార్కింగ్ కు నిలయంగా ప్రధాన రహదారి అయ్యింది

Update: 2024-10-29 14:03 GMT

దిశ,కార్వాన్ : పార్కింగ్ కు నిలయంగా ప్రధాన రహదారి అయ్యింది. గోషామహల్ లోని రవి పెట్రోల్ బంక్ లైన్ లో పోలీస్ గ్రౌండ్ ను ఆనుకొని ఉన్న ప్రధాన రహదారి పార్కింగ్ కు నిలయంగా మారింది. రవి పెట్రోల్ బంక్ లైన్ నుండి మొదలుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు వరుసగా పార్కింగ్ గా వాహనాలు వెలిశాయి. బేగం బజార్ రవి పెట్రోల్ బంక్ నుంచి గోషామహల్ కు చేరుకోవడానికి 60 మీటర్ల రోడ్డు ఉంది.

కాగా అందులో మధ్యలో బారికేడ్లను వేసి ఇరువైపులా వాహనదారులు వెళ్లేందుకు పోలీసులు వెసులుబాటు కల్పించారు. కాగా ఈ ప్రధాన రహదారి పార్కింగ్ కు నిలయంగా మారింది. గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ , ఏసీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో నిత్యం రద్దీగా ప్రధాన రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అసలే పండుగల సీజన్ మరో వైపు వ్యాపారులు వ్యాపారం చేసే ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అందులో వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లు వెయ్యడానికి పరిమితం అయ్యారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోయారు.

పార్కింగ్ కి స్థలం లేక ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు : గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, బాలాజీ

గోషామహల్ కు శని, సోమవారాల్లో సరుకులు కొనేందుకు కొనుగోలుదారులు ఎక్కువగా వస్తుంటారని అలా వచ్చినవారు పార్కింగ్ కి స్థలం లేక ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. అలాంటి వాటిపై చలాన్లు వేసి వాహనాలు లిఫ్టింగ్ చేస్తున్నామని ట్రాఫిక్ సీఐ తెలిపారు.

Tags:    

Similar News