మహిళా భవన్ కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా భవన్ లకు, నాయి బ్రాహ్మణుల కుల సంఘాలకు భూములు కేటాయించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు.
దిశ, బేగంపేట : కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా భవన్ లకు, నాయి బ్రాహ్మణుల కుల సంఘాలకు భూములు కేటాయించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సాయిరాం తో కలిసి సికింద్రాబాద్, తిరుమలగిరి, మారేడుపల్లి తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆయన సూచించారు. వివిధ కోర్టుల్లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించి ఈ కేసుల్లో కోర్టు తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చూడాలని సూచించారు. వార్డులో రెండు రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తసిల్దారులు పాండు నాయక్, భీమయ్య గౌడ్, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.