Traffic Jam: బేగంపేట ఫ్లైఓవర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

బేగంపేట ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-08-26 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: బేగంపేట ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతురిని టెంపో ఢీకొట్టిగా చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బేగంపేట ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. ఈ క్రమంలోనే ఆఫీసులకు, పాఠశాలకు డైలీ అటుగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. గాయపడిన బాధితుడిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.


Similar News