ఆదివాసీ మహిళలపై అత్యాచార సంఘటన విచారకరం

ఆదివాసీ మహిళలపై అత్యాచార సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.

Update: 2024-09-06 16:30 GMT

దిశ, సికింద్రాబాద్ : ఆదివాసీ మహిళలపై అత్యాచార సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టి కఠిన చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులకు సూచించారు. దళిత గిరిజన ఆదివాసీ మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం సరికాదన్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ అత్యాచార బాధితురాలిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.

     మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఆదివాసీ మహిళపై అత్యాచార సంఘటన అనాగరికమని పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. బాధితురాలికి న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పోరాడుతుందన్నారు. బాధితురాలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని ఆకాంక్షించారు. నిందితులపై బలమైన సెక్షన్లను నమోదు చేసి త్వరగా శిక్షపడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి ,జిల్లా శంకర్ రాంబాబు నాయక్ ,దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,హైదరాబాద్​ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పులి కల్పన తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News