స్కూల్ గేటు మీద పడి బాలుడు మృతి..

పాఠశాలలో తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్నటువంటి ఆరు సంవత్సరాల బాలుడిపై ప్రమాదవశాత్తు గేటు పడడంతో బాలుడు మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-11-04 16:06 GMT

దిశ, ఎల్బీనగర్: పాఠశాలలో తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్నటువంటి ఆరు సంవత్సరాల బాలుడిపై ప్రమాదవశాత్తు గేటు పడడంతో బాలుడు మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే హయత్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న అజయ్ ఆరు సంవత్సరాల బాలుడు గేట్ తో ఆడుతుండగా అకస్మాత్తుగా గేటు అతనిపై పడడంతో మృతి చెందాడు. ప్రభుత్వ పాఠశాల గేటు శిథిలావస్థకు చేరుకున్న అట్టి గేటు కు మరమ్మతులు చేయకపోవడమే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యమని, నిర్లక్ష్యం వలన బాలుడు మృతి చెందాడని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని పలువురు స్థానికులు డిమాండ్ చేశారు. పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా విద్యార్థులు వెల్లడించారు. ఇకనైనా అధికారులు ఈ విషయం పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు గేట్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.


Similar News