తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు.. 11.70 డిగ్రీల సెల్సీయస్ నమోదు
తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి....
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండు రోజల పాటు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా అంటే 2 డిగ్రీల సెల్సీయస్నుండి 4 డిగ్రీల సెల్సీయస్వరకు మాత్రమే నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి ఉంటుందని, ఉదయం వేళల్లో పొగ మంచు లేదా పొగమంచు వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 11.73 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కానున్నాయని తెలిపింది.
నిన్న ఆదివారం కూడా ఇదే స్థాయి 11.70 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు అయ్యిందని దీని కారణంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మెదక్ జిల్లాలలో ఆదివారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 10.00 గంటల వరకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు 15.02 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు అయ్యాయని, నేడు సోమవారం హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 15.67 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 27.97 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ క్రమంలో సోమ, మంగళ వారం ఈ రెండు రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో పొడి వాతావరణం కారణంగా హైదరాబాద్, రాజేంద్రనగర్, పటాన్చెరువు, హకీంపేట, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం లలో గుర్తించ దగిన విధంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, నేడు సోమవారం ఆదిలాబాద్ , కొమరం భీం ఆసిఫాబాద్జిల్లాలలో ఉదయం 5 నుండి 10 గంటల వరకు కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలంగాణ వాతావరణ కేంద్రం ఆ ప్రకటనలో తెలిపింది.