'డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై KCR హామీ ఏమైంది..?'
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ హామీ ఏమైంది..? అని తెలుగుదేశం పార్టీ - TDP Secunderabad Parliament President Sai Baba said what happened to KCR's promise on double bedroom houses
దిశ, ముషీరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ హామీ ఏమైంది..? అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి. సాయిబాబా అన్నారు. బుధవారం నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లుడు, బిడ్డ వస్తే తలదాచుకునేదెలా..? గీ దిక్కుమాలిన ఇండ్లు కట్టిస్తే కాళ్లు చాపుకుని పడుకోలేక పోతిమి, ప్రస్తుతం ప్రభుత్వం కట్టే ఇళ్లు పేదలను అవమానించేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని.. ''మేం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తాం" అని 2014 ఎన్నికల ప్రచార సభల్లో ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ ఆచరణలో సాధించింది శూన్యం అని ధ్వజమెత్తారు.
ఒకే ఒక్క గదిలో భార్య, భర్త, పిల్లలు కలిసి జీవించాల్సి రావడం ఎంత నరకమో..? ఆ గదిలోనే మహిళలు బట్టలు మార్చుకోవడానికి చిన్న చాటు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బలహీనవర్గాలకు గౌరవప్రదమైన నివాస గృహం నిర్మిస్తామని.. 2014 మేనిఫెస్టోలో చెప్పి, పేదలకు 120 గజాల్లో 2 పడక గదుల ఇంటిని ప్రభుత్వమే కట్టింస్తుందని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. హైదరాబాద్ లో లక్ష ఇళ్లు, జిల్లాల్లో 2 లక్షల ఇళ్లు ఇస్తాం, లేకపోతే ప్రజలను ఓట్లడగబోమని అసెంబ్లీలో కేసీఆర్ (2017 మార్చి 18న) చెప్పారని, రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.
ప్రతి బడ్జెట్ లోనూ 2.72లక్షల ఇళ్లు కడుతున్నామని వరుసగా ప్రతి ఏడాది పాడిందే పాటగా చెప్పారని, ఇప్పటి దాకా పేదలకు పంపిణీ కట్టిన ఇళ్లు 20,709 మాత్రమే అని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ 8,598.58 కోట్లతో లక్ష ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. 2018 దసరా లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని మంత్రి కేటీఆర్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రాంపల్లి లో శంకుస్థాపన చేస్తూ చెప్పారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో జెఎన్ఎన్ యూఆర్ఎం కింద, వాల్మీకి అంబేద్కర్ యోజన (వాంబే) కింద మంజూరైన ఇళ్లు అసంపూర్తిగా వదిలేశారని విమర్శంచారు. పక్కాగృహాలకు మౌలిక వసతుల కోసం ఎంత ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు సాయిబాబా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి పి. బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెద్దోజు రవీంద్ర చారి, కప్ప కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read more: