మోతిలాల్ కు మద్దతుగా ఓయూలో విద్యార్థుల ఆందోళన..

నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ కు మద్దతుగా విద్యార్థులు ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Update: 2024-07-01 09:30 GMT

దిశ, సికింద్రాబాద్ : నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ కు మద్దతుగా విద్యార్థులు ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆర్ట్ కళాశాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకొని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ నిరుద్యోగ డిమాండ్ల సాధన కోసం ఏడు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ పరిస్థితి విషమిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

మోతిలాల్ కు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలన్నారు. గ్రూప్1, గ్రూప్ 2 పోస్టులను పెంచి, డీఎస్సీ వాయిదా వేసి, మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Similar News