జీవితంపై విరక్తి చెంది విద్యార్థిని ఆత్మహత్య

అనారోగ్య కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతూ జీవితంపై విరక్తి చెందిన విద్యార్థిని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.

Update: 2024-02-01 15:02 GMT

దిశ, ఎల్బీనగర్ : అనారోగ్య కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతూ జీవితంపై విరక్తి చెందిన విద్యార్థిని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీ, రోడ్ నెంబర్ 7 లోని జీవన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బ్రహ్మంబాబాకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో దీప్తి (18) ఒకరు. స్కిన్ ఎలర్జీ వలన మానసికంగా పలు ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ విషయంలో మధ్యాహ్నం

     రెండున్నర గంటల సమయంలో పడకగదిలోని సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పడక గదిలోకి వెళ్లిన దీప్తి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి మృతురాలి సోదరి పావని పలుమార్లు డోర్ కొట్టినప్పటికీ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో వారు డోరు పగలగొట్టి గదిలోకి కి వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్న దీప్తిని చికిత్స కోసం సమీపంలోని కామినేని హాస్పిటల్ కు తరలించగా మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. సోదరి పావని ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read More..

ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యం

Tags:    

Similar News