‘కబ్జా ఎక్కడ చేశానో చూపించండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి’

ఎవరైతే కొంత మంది సోదరులు నేను కబ్జా చేసిన అని అంటున్నారో సబితమ్మ కబ్జా చేసిన భూమి ఎక్కడుందో తీసుకొచ్చి హాయిగా పేదవారికి పంచిచ్చే శక్తి మా సోదరులు గా మీకే ఉందని విద్యా శాఖ మంత్రి సబితా

Update: 2023-08-12 03:29 GMT

దిశ, మీర్ పేట్: ఎవరైతే కొంత మంది సోదరులు నేను కబ్జా చేసిన అని అంటున్నారో సబితమ్మ కబ్జా చేసిన భూమి ఎక్కడుందో తీసుకొచ్చి హాయిగా పేదవారికి పంచిచ్చే శక్తి మా సోదరులు గా మీకే ఉందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్లో గ్రంథాల ఎక్స్టెన్షన్ సెంటర్ పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకు స్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతోనే అభివృద్ధిలో ముందుకెళ్తున్నామన్నారు. గతంలో మురికి కూపాలుగా ఉండే చెరువులు నేడు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు గా అభివృద్ధికి కృషి చేస్తున్నామని గ్రంథాలయాల్లో చిన్నారులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ కు ఉపయోగపడే పుస్తకాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్లు పన్నులపై ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకే మంత్రి కేటీఆర్ తో మాట్లాడి పాత పన్నులు తీసుకోవాలని మెమో ఇప్పించామని ఎవరో ప్రతిపక్ష నాయకులు ధర్నాలు చేస్తున్నారని కాదు నా ప్రజలు మా నాయకుల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

అపర భగీరథునికి క్షీరాభిషేకం చేసిన మంత్రి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లేల గూడ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ యం దుర్గా, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ మాధవి,స్థానిక కార్పొరేటర్ సబితా రాజశేఖర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అరకల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్, రవి నాయక్, నరసింహ, నవీన్ గౌడ్, రామ్ చందర్, రాజేందర్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు తది తరులు పాల్గొన్నారు.


Similar News