ఈఆర్సీ చైర్మన్‌గా దేవరాజు నాగార్జున
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. ...
దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. ఈ సందర్భంగా జీఎస్టీ కాలనీలో ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఈఆర్సీ పాలకమండలి పదవీకాలం ఈనెల 29తో ముగిసింది. కాగా చైర్మన్‌గా దేవరాజు నాగార్జునను ప్రభుత్వం నియమించింది.
వనపర్తి జిల్లాకు చెందిన నాగార్జున.. ప్రాథమిక విద్యాభ్యాసం అదే జిల్లాలో కొనసాగించారు. డిగ్రీ ఆర్‌ఎల్‌డీ కాలేజీలో, గుల్బర్గాలోని ఎస్‌ఎస్‌ఎల్ కాలేజీలో లా, ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేయగా, అమెరికాలోనూ పలు న్యాయకోర్సులు అభ్యసించారు. 1986లో న్యాయవాదిగా, 1991 మే1న జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యా రు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2019లో కామారెడ్డి జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. 2022లో హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2023లో మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యి అక్కడే విరమణ పొందారు. ఇదిలా ఉండగా నాగార్జున బాధ్యతల స్వీకారోత్సవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరయ్యారు.