దిశ కథనానికి స్పందన.. నాన్ డ్యూటి పెయిడ్ రూపంలో మద్యం అక్రమంగా దిగుమతి దిశ కథనం
తెలంగాణలో జంటనగరాలుగా పేరొందిన హైదారాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ యంత్రాంగం కట్టడి చేయాలని హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ కేఏబీ శాస్త్రీ , అసిస్టేంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జంటనగరాలుగా పేరొందిన హైదారాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ యంత్రాంగం కట్టడి చేయాలని హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ కేఏబీ శాస్త్రీ , అసిస్టేంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులతో అబ్కారీ భవన్‌లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంఆర్‌పీ వాయిలేషన్ లేకుండా చూడాలని, బార్లు, పబ్బులు, మద్యం దుకాణాల్లో నాన్‌డ్యూటి పెయిడ్ వినియోగం లేకుండా ఎప్పటికప్పుడు ఎక్సైజ్ యంత్రాంగం పర్యవేక్షణ చేయాలని డిప్యూటి కమిషనర్ సూచించారు. డిటిఎఫ్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లతో డ్రగ్స్‌పై అమ్మకాలపై నిఘా పెట్టి డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత కూడ ఎక్సైజ్ శాఖ పై ఉందన్నారు. కొత్త సంవత్సరంలో మరింత ఉత్సహాంగా పని చేయాలని, ఎక్సైజ్ అధికారులు సూచించిన విధులతోపాటు కేసుల్లో చార్జీ షీట్స్ వేయించడంపై దృష్టి సారించాలన్నారు. ఎన్‌పోర్స్ ఈఎస్ ఎన్. సమితా సౌజన్య ఈ ఎస్‌లు శ్రీనివాసరావు సీఐలు హజరయ్యారు.