Hyderabad : ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు.. ముగిసిన BLN రెడ్డి విచారణ

ఫార్ములా ఈ-కార్‌ రేసు(Formula E Car Race) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-01-08 14:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ-కార్‌ రేసు(Formula E Car Race) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న BLN రెడ్డిపై బుధవారం ఈడీ(ED) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 9 గంటలకు పైగా ఈ సుధీర్ఘ విచారణ జరిగింది. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్ సమయంలో ఈయన హెచ్ఎండీఏ(HMDA)లో కీలక పదవిలో ఉన్నారు. ఆ సమయంలోనే రూ.55 కోట్ల నిధులను FEOకి BLN రెడ్డి బదిలీ చేశారు. ఈ నిధుల బదిలీకి సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. కాగా అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.   

Tags:    

Similar News