గచ్చిబౌలి ఓఆర్ ఆర్ వద్ద సైక్లింగ్ ట్రాక్ తొలగింపు
గచ్చిబౌలి ఓఆర్ ఆర్ పక్కన ఏర్పాటు చేసిన సైక్లింగ్
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి ఓఆర్ ఆర్ పక్కన ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్ ను అధికారులు ఉన్నపళంగా తొలగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకిల్ ట్రాక్ ను నిత్యం ఎంతోమంది ఉపయోగిస్తారు. ఈ ట్రాక్ తొలగించడం పట్ల సైక్లిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఈ సైక్లింగ్ ట్రాక్ తొలగిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా, హెచ్ ఎండీఏ కార్యాలయం వద్ద సుమారు 100 అడుగుల మేర ఈ ట్రాక్ తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.