మహంకాళి ఆలయ ఈవోకు ఊరట

కోర్టు ధిక్కరణ కేసులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఈవోకు హైకోర్టు విధించిన నెల రోజుల సాధారణ జైలు, రూ.2వేల జరిమానా తీర్పుపై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసింది.

Update: 2024-09-08 13:31 GMT

దిశ, బేగంపేట : కోర్టు ధిక్కరణ కేసులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఈవోకు హైకోర్టు విధించిన నెల రోజుల సాధారణ జైలు, రూ.2వేల జరిమానా తీర్పుపై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసింది. చీరెలు, జాకెట్ ముక్కలు, కొబ్బరి చిప్పల సేకరణ నిమిత్తం సికింద్రాబాద్ మహంకాళి ఆలయ ఈవో మార్చి 3వ తేదీన జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ రాకేష్ తో పాటు మరికొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై స్థానిక విలేకరులకు ఆదివారం ఈవో వెల్లడించారు. దీనిపై న్యాయమూర్తి పిటిషనర్ల లీజును జూలై 1వ తేదీ నుంచి 5 నెలలు పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

     జూన్ 13వ తేదీన కోర్టు తీర్పు ఇచ్చినా ఈవో వాటిని ఉల్లంఘించి జూన్ 26వ తేదీన మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈవో కావాలనే అమలు చేయకుండా టెండర్లకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్లు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఈవోకు నెల రోజుల సాధారణ జైలు, రెండు వేల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈవో సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈవోకు హైకోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్ష తీర్పుతో పాటు పిటిషనర్లకు 5 నెలల పాటు లీజును పొడిగించాలనే తీర్పుపై 6వ తేదీన సుప్రీం కోర్టు స్టేను మంజూరు చేసింది. 

Tags:    

Similar News