రియల్ ఎస్టేట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తా : ప్రొఫెసర్ కోదండరాం

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు

Update: 2024-12-24 14:57 GMT

దిశ,కార్వాన్ : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సుమారు 20 శాతం యువత ఉపాధి పొందుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆ దిశగా మీరు చేసే సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తానని అన్నారు. రియల్ ఎస్టేట్ సజీవంగా ఉండాలి అంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ,అదేవిధంగా హౌసింగ్ బోర్డు ద్వారా నూతన కాలనీలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అన్ని రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సంస్థలు సభ్యులుగా చేరాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసి అసోసియేషన్ను బలోపేతం చేద్దామని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం నరసయ్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని గుర్తిస్తూ వ్యాపారస్తులకు ఏజెంట్లకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ,రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న పేద అసోసియేట్లకు ఆరోగ్య కార్డులు అందజేయాలని కోరారు.

రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి వివిధ రంగాలలో సమాజ సేవ చేస్తున్న గ్రేటర్ ప్రాజెక్ట్స్ ఎండి సయ్యద్ ఇమామ్, కరుణాకర్లకు అసోసియేషన్ తరపున జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దిరాజు, శ్రీధర్, కార్యదర్శులు లక్ష్మణరావు, బొమ్మ వెంకటేశ్వర్లు, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రహీముద్దీన్ రవీందర్ గౌడ్ , రియాజ్,కాటేపల్లి జనార్ధన్ ,సెల్ వెంకన్న, నిర్మలారెడ్డి ,సుజాత ,వనజ,, రాజిరెడ్డి, సంతోష్, కరుణాకర్, పేరం వెంకటేశ్వర యాదవ్, తివారి, వెంకటేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, కాకునూరు సుధాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News