పుస్తకాలు చదవడం ద్వారా మంచి సమాజం పెరుగుతుంది : గవర్నర్

ముషీరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు.

Update: 2024-12-28 11:44 GMT

దిశ, రాంనగర్ : ముషీరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ, అక్షర యాన్, ట్రైబల్ వెల్ఫేర్, స్టేట్ సెంటర్ లైబ్రరీ, పలు స్టాళ్లను సందర్శించారు. ముందుగా బుక్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ ను పరిశీలించారు. ఈ సభకు అధ్యక్షత గా బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు యాకూబ్ వ్యవహరించారు. సెక్రటరీ ఆర్ వాసు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ… ఈ బుక్స్, ఆడియో బుక్స్ చదవడం కన్న ప్రింటెడ్ పుస్తకాలు చదవడం మంచి అలవాటన్నారు. పుస్తకం చేతిలో పట్టుకుంటే నేరుగా రచయితే విషయం చెప్పుతున్న అనుభూతి ఉంటుందన్నారు. ఈ బుక్స్ అయితే రైటర్ కి, రీడర్ కి మధ్యలో మిషన్లు, కంప్యూటర్లు, టాబ్స్ ఉంటాయి. కానీ పుస్తకం చేతిలో ఉంటే అలాంటివి ఉండవని,ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలన్నారు.

లైబ్రరీస్, కమ్యూనిటీ లైబ్రరీలు జ్ఞాన సంపదను కాపాడతాయాన్నారు. పెళ్లికి వెళ్తే పుస్తకాలు ఎందుకు ఇవ్వొద్దు ? అని కొత్త ఆలోచన చేయాలని సూచించారు. పండగలకు, పెళ్లిళ్లకు వెళ్తే గిఫ్ట్లు, బొకేలు కన్న పుస్తకం ఇవ్వొచ్చు కదా? గిఫ్ట్ లు కొన్ని రోజులే ఉంటాయి. కానీ పుస్తకాలు ఎప్పటికీ ఉండిపోతాయి- మానవ నాగరికత ఉన్నన్ని రోజులు పుస్తకాలు ఉంటాయి. జాతీయ వ్యాప్తంగా పుస్తక మహోత్సవాలు పాఠకులను ఆకర్షిస్తున్నాయి. పుస్తకాలు చదవడం ద్వారా మంచి సమాజం పెరుగుతుందన్నారు.

బుక్ ఫెయిర్ లో డొనేషన్ బాక్స్ పై గవర్నర్ ప్రశంశలు

బుక్ ఫెయిర్ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ బుక్ ను గవర్నర్ అభినందించారు. ఇక్కడికి వచ్చిన ఎన్నో పుస్తకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల కు వెళ్ళడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, బుక్ ఫెయిర్ వైస్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్, వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీ సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.


Similar News