హుక్కా సెంటర్‌పై బాలాపూర్ పోలీసుల దాడులు
నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నడుపుతున్న హుక్కా సెంటర్‌పై బాలాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు
దిశ, బడంగ్ పేట్ : నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నడుపుతున్న హుక్కా సెంటర్‌పై బాలాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. హుక్కా సెంటర్ యజమానితో పాటు మేనేజర్‌ను మరో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకుని బాలాపూర్ పోలీసులు నోటీసులు అందజేశారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ... సుల్తాన్పూర్ ప్రాంతంలో గత కొంత కాలంగా నిబంధనలకు విరుద్దంగా యాహ్యా హుక్కా సెంటర్‌ను నడిపిస్తున్నాడు. అందులో షోయబ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ బృందం హుక్కా సెంటర్‌పై దాడులు నిర్వహించారు.
ఎటువంటి లైసెన్సు లేకుండా నిబంధనలకు విరుద్దంగా యాహ్యా హుక్కా సెంటర్‌ను అక్రమంగా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హుక్కా సెంటర్ యజమాని యాహ్యాతో పాటు మేనేజర్ షోయబ్, ఐదు గురు కస్టమర్లు సోఫియా బాబా (26), సయ్యద్ మన్సూర్ (20), సయ్యద్ అస్లామ్(19), మొహమ్మద్ నూర్ (19), షేక్ ఆలీ (22) లను పోలీసులు అదుపులోకి తీసుకుని నోటీసులు అందజేశారు. వారి వద్ద నుంచి 8 హుక్కా పాట్స్, 16 హుక్కా పైప్స్, 5 బ్రిక్ కోల్ బాక్సెస్, కోకనెట్ కోల్ బాక్స్, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.