అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు..
సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
దిశ,బేగంపేట: సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు వస్తు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ముందస్తు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్ పేట్ పోలీసులు ఆయనకు మరో మారు సోమవారం నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఈ నెల 5వ తేదీన కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ భావించిన పోలీసులు మొదటి సారి నోటీసులు ఇచ్చారు.
అల్లు అర్జున్ రావడంతో ఆస్పత్రిలో ఉండే రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అలాగే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశాలున్నాయని అందువల్ల ముందస్తు సమాచారం ఇస్తే తగిన బందోబస్తు ఏర్పాటు చేసికుంటామని తెలిపారు. అలాగే పెద్ద ఎత్తున అభిమానులు గుమికూడకుండా గోప్యంగా పరామర్శకు వస్తే ఎలాంటి గందరగోళం జరిగే అవకాశాలు కూడా ఉండవని నోటీసులు సూచించారు. అల్లు అర్జున్ ఇంట్లో లేకపోవడంతో రాంగోపాల్ పేట్ ఎస్సై నర్సింగరావు ఆయన మేనేజర్ కు నోటీసులు అందించి వచ్చారు.