పద్మశ్రీ మొగులయ్య కు అండగా రాచకొండ కమిషనర్

పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ప్రహరి గోడను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడం జరిగింది.

Update: 2024-10-14 11:07 GMT

దిశ, ఎల్బీనగర్ : పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ప్రహరి గోడను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడం జరిగింది. ఈ విషయంపై మొగులయ్య ఎల్బీనగర్ లోని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ కార్యాలయంలో కూల్చివేతకు సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్ కు వివరించారు. వివరాలు తెలుసుకున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ… మొగులయ్య కు ప్రభుత్వం ఇచ్చిన భూమి పరిరక్షణకు పోలీసు శాఖ పరంగా పూర్తి బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ మొగులయ్యకు వెల్లడించారు. అనంతరం పద్మశ్రీ కిన్నెర ముగ్గులయ్యను గౌరవపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్ , ఎస్ఐ లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News