జీహెచ్ఎంసీలో మళ్లీ ప్రజావాణి ప్రారంభం.. జోన్ల వారీగా ఫిర్యాదుల స్వీకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది.
దిశ, సిటీ బ్యూరో : ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు జోన్లలో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎల్.బీ నగర్ జోనల్ ఆఫీసులో మొదటి ఫిర్యాదును స్వీకరించారు. అదేవిధంగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్‌రెడ్డి ప్రారంభించారు.