Collector : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

Update: 2024-09-23 12:52 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 147 దరఖాస్తులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజావాణిలో తమకు అందిన అర్జీలలో గృహ నిర్మాణ శాఖకు 91 పింఛన్లు 23, భూ సమస్యలు 08,గ్యాస్ సబ్సిడీ 03, ఇతర విభాగాలకు చెందిన 22 ఉన్నట్లు పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… ప్రత్యేక అధికారులుగా నియమించబడిన వారు తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల హాజరు శాతం(ఎఫ్ఆర్ఎస్) పరిశీలించాలని, నెల కంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థుల పేర్లు ఎఫ్ఆర్ఎస్ నుంచి తొలగించాలని, ఆన్వల్ గైడెన్స్ రిజిస్టర్ (ఏజిఆర్) రిజిస్టర్ ను అప్డేట్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెరిగేలా చూడాలని సూచించారు. పాఠశాలను సందర్శించినప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా నిర్మించిన పనుల నిర్వహణ సరిగా ఉందా లేదా పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్( లోకల్ బాడీస్) కదిరివన్ పి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్ సింగ్, జిల్లా అధికారులు ఆశన్న, పెరికె యాదయ్య, వడ్డెన్న, కోటాజి, రాజేందర్, పవన్ కుమార్, ఇలియాజ్ అహ్మద్, డాక్టర్ వెంకట్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News