సోషల్ మీడియాలో సీఎంను అవమానపరిచే పోస్టులు…వ్యక్తి అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను సోమవారం మధ్యాహ్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-11-18 14:00 GMT

దిశ, సిటీ క్రైమ్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను సోమవారం మధ్యాహ్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరుస్తూ, అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, రాజకీయ పరంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఫిర్యాదు పై సీసీఎస్ పోలీసులు సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ 2317/2024 కింద కేసును నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కొణతం దిలీప్ ను సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. విచారణలో ఎక్స్ లో @Telugu Scribe, @Abba Sairam01, @AshokReddyNlG ఈ పోస్టింగ్ లను పోస్టు చేసిన పోస్టుల వెనుక ప్రధాన పాత్ర కొణతం దిలీప్ పోషించినట్లు గుర్తించిన పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. వీటితో పాటు దిలీప్ ను కోర్టులో హాజరుపర్చి , రిమాండ్ కు తరలించారు. మరో వైపు కోర్టు ఆదేశాలనుసారం పోలీసులకు అడిగిన వివరాలను అందించడానికి వెళ్లిన సమయంలో దిలీప్ రెడ్డిని దొంగ దారిని అరెస్టు చేశారని, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన భార్య స్వర్ణ కిలారి ఆరోపించారు.


Similar News