MDMA drugs: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి మహానగరంలో డ్రగ్స్(drugs) సరఫరా కొనసాగుతూనే ఉంది.

Update: 2024-10-25 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి మహానగరంలో డ్రగ్స్(drugs) సరఫరా కొనసాగుతూనే ఉంది. తాజాగా గత కొద్ది రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన వెస్ట్రన్ కల్చర్ ఈ డ్రగ్స్ దందాను కొనసాగించేలా చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. హుమాయున్‌నగర్‌(Humayunnagar)లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 50 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్(drugs) బయటపడింది. దీంతో పోలీసు అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. పట్టుబడిన 50 గ్రాముల డ్రగ్స్ విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఓ అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.


Similar News